కరోనా నివారణ కోసం, ముందస్తు జాగ్రత్త…వేడి నీళ్లు తాగడం,కషాయాలు తాగటం ఆవిరి పట్టడం వంటి చిట్కాలు నిరంతరం ఫాలో అవుతూ ఉంటే వాటి వల్ల వైరస్ నుంచి రక్షణ దొరికే విషయం అలా ఉంచి ఆరోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్, అల్సర్లు వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అధ్యయనకారులు..సోషల్ మీడియాలో వచ్చే సలహాలు గుడ్డిగా నమ్మవద్దు అంటున్నారు.అంటువ్యాధుల వచ్చిన సమయంలో మాస్క్ ధరించడం చేతులు శుభ్రంగా కడుక్కోవటం సామాజిక దూరం పాటించటం వంటి ఆరోగ్య సూత్రాలు ఎన్నో దశాబ్దాల కాలం నుంచి ఉంది.శాస్త్రీయంగా ఎంత అభివృద్ధి చెందిన ఇప్పటికీ ఇవే ఆరోగ్య సూత్రాలు.కరోనా వ్యాప్తి  గురించి ఆందోళన తో ఉండకుండా  రక్షణ చర్యలు పాటించండి అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment