ఒకే సారి మూడు చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చాయి. సాహో,బిచ్చొర్,స్ట్రీట్ డాన్సర్ త్రిడి. ఈ మూడు వేటికవే భిన్నంగా ఉన్నాయి. కాదనలేకపోయాను .ఈ మూడు సినిమాల మధ్య షూటింగ్ లతో ఒక్కోసారి ఒక్కో పాత్రలో నటించటం కొంచెం కష్టమే కానీ ఇంకోసారి ఇలాంటి మంచి అవకాశం ఉండదుగా అని ఎంజాయ్ చేస్తున్నాను అంటోంది శ్రధ్ద కపూర్. ఒక్కో సారి నిద్ర పోయే సమయం కూడా దొరకటం లేదు. అదృష్టం మూడు సార్లు తులుపు తట్టింది. ఇక తీయకపోతే ఎలా ,తర్వాత అని చెప్పలేం కదా. నటులకే కాదు ఎవరికైన ఇలాంటి అవకాశాలు ఇకే సారి వస్తుంటాయి. ఒకే జీవితంలో ఇంకొన్ని జీవితాలు అనుభవించే లాగా ..కష్టం లేకపోతే ఇంత థ్రిల్ ఎలా దక్కుతుంది నాకు అంటోంది శ్రద్ద కపూర్.

Leave a comment