కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి కనుక,ముడుపొరలు ఉండే మాస్క్ లయితే కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కోగలవాని నాన్ డిగో లోని యూనివర్సిటీ పరిశోధికులు చెపుతున్నారు. ఈ వైరస్ ముక్కు ద్వారానే ప్రవేశిస్తుంది కనుక మాస్క్ కి ముడుపొరలు ఉండటం వలన వైరస్ వాడపోత ప్రక్రియ మూడు దశలుగా జరిగి ప్రమాదం తగ్గుతుంది. తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వైరస్ తో కూడిన పెద్ద సైజు తుంపర రేణువుల్ని ఒకటి రెండు పొరలు అడ్డుకుంటాయి. ఒకే పొర గనుక ఉంటే రేణువులను 30 శాతం, రెండు పొరలు ఉంటే 91 శాతం  నిరోధించగలగుతున్నాయని అదే మూడు పొరలుగా ఉంటే వైరస్ లోపలకు చేరే అవకాశమే లేదంటున్నారు పరిశోధకులు కనుక త్రీ లేయర్డ్ మాస్క్ పెట్టుకోమంటున్నారు .

Leave a comment