త్రిదళం త్రిగుణాకారం, త్రినేత్రంచ  త్రియాయుధమ్,త్రిజన్మ పాప సంహారం,ఏకబిల్వం శివార్పణం!!

        మేడారం జాతర, మాఘ పౌర్ణమి కన్నుల పండుగగా చేసుకున్నాం సఖులూ!!మరి “మహాశివరాత్రి” వచ్చేస్తోంది పదండి కోటప్ప కొండ ఎక్కి వద్దాం!!
గుంటూరు జిల్లా నర్సరావుపేట సమీపంలో మనకు శివుడు త్రికూటేశ్వరుడిగా దర్శనం ఇస్తారు.దక్ష యఙ్ఞ తరువాత శివుడు బాలుని రూపంలో దక్షిణామూర్తి అవతారంలో తపస్సులో వుండగా బ్రహ్మ దేవుని కోరిక మేరకు ఈ కొండ వద్ద కలుద్దాం అని బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులుగా ఎటు నుంచి చూసిన మూడు శిఖరాలతో దర్శనం ఇస్తారు.
సుందుడికి శివ భక్తితో గొల్లభామ అని పుత్రిక కలిగింది.శివయ్యకు పరమ భక్తురాలు.
శివన్న కొరకు రోజు చల్ల,పెరుగు నైవేద్యంగా తీసుకొని వెళ్తున్న సమయంలో ఒక కాకి చల్ల కుండని పగులగొట్టిన శివయ్య ఆగ్రహంతో కోటప్ప కొండ పై కాకి అనర్హురాలని శపించాడు.

నిత్య ప్రసాదం: కొబ్బరి,పంచామృతాభిషేకం.

                -తోలేటి వెంకట శిరీష

Leave a comment