కేరళకు చెందిన టిఫని బ్రార్ స్థాపించిన జ్యోతిర్గమయ ఫౌండేషన్ అంధత్వం తో బాధపడుతున్న వారికి అండగా నిలబడుతుంది.అంధుల కోసం ఇచ్చే ఈ ఫౌండేషన్ ద్వారా ఇచ్చే ట్రైనింగ్ లో ఇంగ్లీష్ లో మాట్లాడటం కరెన్సీ నోట్ల ను గుర్తించటం ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగం ముఖ్యంగా ఉంటాయి. టిఫిని  అంధురాలు. ఆమెను మోడ్రన్ హెలెన్ కెల్లర్  అంటుంటారు. ఆమె చేస్తున్న సేవకు గుర్తింపుగా అనేక అవార్డులు అందుకుంది .అమెరికాలోని లైట్ హౌస్ ఫర్ ది బ్లయిండ్  నుంచి హోల్మన్ ప్రైజ్ 2020,డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్ మెంట్ విభాగం 2017 లో బెస్ట్ రోల్ మోడల్ అవార్డు తో సత్కరించింది.

Leave a comment