కొందరికి తీపి అంటే ఎంతో ఇష్టం ,మరి కొందరికి కారం ఇలా పలు రకాల రుచుల సమ్మేళనం తో పలానాది తినాలి అనే కోరిక నాలుకను లాగేస్తుంటాయి . ఇలా తినాలన్న కోరిక మన బుర్రలో వుందా ? లేదా మనకేం కావాలో శరీరానికే తెలుస్తుందా ? ఈ ప్రశ్న వేసుకుంటే సమాధానం చాలా సింపుల్ . ఇది చాలా అవసరం కూడా. మనం శరీరానికి నిజంగా అవసరం అయ్యే పదార్ధాలు తినాలన్నా కోరిక ఏవీ ఉండదు. ఇంకా చెప్పాలంటే ఆరోగ్య వంతమైన పదార్ధాలే. తినాలన్న కోరిక కూడా చాలా అరుదే. తినాలనే కోరికలు సంతోషపూరితమైన ఎమోషనల్ అనుసంధానాలు అంటారు నిపుణులు . అయితే కూల్ డ్రింక్స్ క్యాండీలు కంటికి ఇంపుగా కనిపించే ఏదైనా సరే తినాలనే కోరికను బయోలాజికల్ మూలం ఉంటుంది. ఉప్పు ఫ్యాట్ మెదడులోని ఆహ్లాదకర కేంద్రాలను చురుగ్గా చేస్తాయి. అంటే తినాలన్న కోరిక ఎక్కువ భగం మెదడుదే  తప్ప శరీరం తప్పు ఏవీ లేదు. ఈ విషయం  తేలింది కనుక ఆలోచనను ఎలా కంట్రోల్ లో పెట్టుకోవటమో ఆలోచించుకోవాలి.

Leave a comment