మా బర్గర్ తినండి పాతిక వేలు సంపాదించుకోండి అంటున్నారు బ్యాంకాక్ చెందిన ఫుడ్ బెయిన్ సంస్థ క్రిస్ స్టీక్స్ అండ్ బర్గర్స్ నిర్వాహకులు . ఆరు కేజీల బరువు ఉండే ఈ బర్గర్ ని కేవలం తొమ్మిది నిముషాల్లో తినేయాలి . అలా తింటేనే ఈ ప్రైజ్ మనీ వస్తుంది . థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ కు చెందిన ఈ కంపెనీ ఈ పోటీ నిర్వహిస్తోంది . చాలామంది ట్రై చేశారు . ఇప్పటి వరకు ఎవరు నెగ్గలేదు . ఈ పోటీలో పాల్గొనాలంటే ముందు దాన్ని ఎనిమిది వేలుపెట్టి కొనాలి . సమయంలో తింటే డబ్బులు వస్తాయి . కానీ తినలేకపోతే ఎనిమిదివేలు దండగే ఈ పోటీలో పాల్గొనేందుకు మాత్రం జనం బాగానే ఆశక్తి చూపెడుతున్నారు .

Leave a comment