కొత్తకొత్త ఉద్యోగ అవకాశాలు ,ఉపాధి మార్గాలు దొరుకుతున్నాయి . భోజనం చేయటం ,కొత్త రుచులు ఆస్వాదించటం ఇష్టమా ?అయితే కడుపునిండూ తింటూ డబ్బు సంపాదించు కొనే జాబ్స్ ఉన్నాయ్ . నోరూరించే రకరకాల వంటలు తింటూ డబ్బు సంపాదించు కొనే జాబ్స్ ఉన్నాయి . నోరూరించే రకరకాల వంటలు తింటూ వాటి రుచులను వర్ణించి చెపితే చాలు . నెలకు ఆరు నుంచి ఏడూ లక్షలు సంపాదించవచ్చు . ప్లేట్ లో వడ్డించుకొన్న ప్రతి ఆహారం గురించి ,దాని రుచి గురించి చక్కగా అర్ధం అయ్యేలా వివరించాలి . అదికూడా రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా కొనసాగాలి . దక్షిణ కొరియాలో ప్రారంభం అయింది . ఈ లైవ్ స్ట్రిమ్ ,ఈటర్ . ఇప్పడిది  ప్రపంచం వ్యాప్తంగా ఎంతో మంది కి సరికొత్త అవకాశంగా ఉంది ఈ లైవ్ స్ట్రీమ్ ఈటర్స్ కు ఛానల్సే జీతాలిస్తున్నాయి . వ్యూవ్స్, లైక్స్ ,ఆధారంగా యుట్యూబ్ వివిధ ఛానళ్ళకు డబ్బు చెల్లిస్తోంది .

Leave a comment