మామిడి అంటే పచ్చగా,  ఆకుపచ్చగా ,బంగినపల్లి,రసాలు మాత్రమే కాదు దేశ విదేశాల్లో రకరకాల మామిడి పండ్లు పండిస్తున్నారు. థాయిలాండ్ లో మ్యాప్ రాంగ్ అనే మామిడి పండ్లు పండుతాయి. ఇవి రెండు నుంచి  ఐదు సెంటీ మీటర్ల వ్యాసంలో ఆరు సెంటీ మీటర్ల   పొడవు ఉంటాయి.  పండాక నారింజ పండు రంగులో టెంక ఉదా  రంగులో ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి చేస్తారు. పండేక తీపి పులుపు కావలసిన రుచితో వుండే వీటిని తొక్కతో సహా తింటారు. ఈ పండ్లలో నీటి శాతంఎక్కువ . ఈ పండ్లు ఊపిరి తిత్తులు ,గుండె మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

Leave a comment