వినరో భాగ్యము విష్ణుకథ…..
వెనుబలమిదివో విష్ణు కథ…

సఖులు!! శ్రావణ మాస శుభాకాంక్షలు!!
శ్రవణా నక్షత్ర మందు మరి ఆ యేడుకొండల వాడిని స్మరించాలి కదా!! స్వామి వారి ప్రసాదం  రుచికరమైన ” లడ్డు” కి మనందరం జన్మదిన శుభాకాంక్షలు అందజేద్దామా!!
వేంకటేశ్వర స్వామి కి చాలా రకాల నైవేద్యాలు తయారు చేస్తారు కానీ అన్నింటిలోకి లడ్డు కే ప్రాముఖ్యత ఎక్కువ. భక్తులకు తిరుమల అంటే లడ్డే గుర్తుకు వస్తుంది.
తిరుమల శ్రీవారి లడ్డు మూడు రకాలు.1)ఆస్థాన లడ్డు 2)కల్యాణోత్సవ లడ్డు 3)ప్రౌక్త లడ్డు.  ప్రత్యేక అధికారుల నిమిత్తం చేసేది ఆస్థాన లడ్డు. స్వామి వారి కల్యాణోత్సవ సమయంలో చేసేది కల్యాణ లడ్డు.సాధారణ భక్తులకు అందజేసేది ప్రౌక్త లడ్డు. అందరం ఈ శుభ శ్రావణమాసాన్ని తిరుమల లడ్డు నైవేద్యంగా ప్రసాదం స్వీకరించి వరలక్ష్మి దేవి పూజలు ప్రారంభిద్దామా మగువలూ!!

లక్ష్మీ….రావే మా ఇంటికి..క్షీరాబ్ది పుత్రి…!!

-తోలేటి వెంకట శిరీష

Leave a comment