ఇప్పుడు నారింజ పండ్లు బాగా దొరికే రోజులు. ఏ కాలానికి వచ్చే పండ్లు ఆ కాలంలో తప్పనిసరిగా తినాలి. సీజనల్ ఫ్రూట్స్ వదులుకుంటే ఇంకోసారి వెంటనే దొరకవు కదా . అలాగే చాలా త్వరలో మామిడిపండ్లు వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ తియ్యని నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్  మేగ్నేషియం సోడియం తో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ఈ పండ్ల లో నీటి శాతం ఎక్కువ. నోటి దుర్వాసన పోగొట్టే గుణం ఈ పండ్లకి వుంది. ఆకలి తక్కువగా ఉంటే ఆరెంజ్ తింటే ఆకలి బాగా పుడుతుంది. అధికంగా వుండే బ్లడ్ ప్రెజర్ ను తగ్గిస్తుంది. గుండె వ్యాధులు వచ్చే అవకాశం సమస్యలు పోతాయి. కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం వుంది. ప్రతి రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగితే కిడ్నీ లో వుండే స్టోన్స్ కరిగిపోయే అవకాశాలున్నాయి. కొవ్వును తగ్గించటం తో పాటు వ్యాధి నిరోధిక శక్తిని పెంచుతాయి నారింజలు

 

Leave a comment