మూడో శతాబ్దంలో రోమ్ నగరాన్ని చక్రవర్తి క్లాడియస్ పరిపాలించే వాడు. అతనికి వివాహ వ్యవస్థపైన నమ్మకం లేదు. పెళ్ళి చేసుకొంటే మగాళ్ళ బుద్దీ సామార్ధ్యం నశిస్తాయనే అపోహతో ఉండే వాడు. తన సామ్రాజ్యంలోని సైనికులు, అధికారులు వివాహం చేసుకోకూడదని శాషించాడు. ప్రేమికులు విలవిల లాడేవారు. చక్రవర్తి క్లాడియస్ ఆజ్ఞను వాలెంటైన్ అనే వ్యక్తి ధిక్కరించి పలువురు సైనికులు,అధికారులకు వివాహం జరిపించాడు. కోపంలో రోజు క్లాడియస్ వాలెంటైన్ ను ఫిబ్రవరి 14న ఉరి తీయించాడు. ప్రేమకోసం ,ప్రేమికుల కోసం ప్రాణాలు అర్పించిన వాలెంటైన్ గుర్తుగా ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఈ రోజుకు సంబంధించి ఎన్నో కథల్లో ఒకటిది.

Leave a comment