కూరలు,పండ్లు కోస్తున్నపుడు వాటి తొక్కలు పారేయకండి వాటితో సూప్ లు ఇతర పదార్దాలు తయారీ కోసం వెజిటబుల్ స్టాక్ తయారు చేయండి అంటున్నారు డైటీషియన్ . రకరకాల కూరగాయల తొక్కల్ని పడేసి అందులో అల్లం తరుగు ,ఉప్పు,కొన్ని లవంగాలు దాల్చిన చెక్క ముక్క వేసి మరిగిస్తే కాస్త చిక్కగా వెజిటబుల్ స్టాక్ సిద్దం అవుతుంది . ఇది చాలా విలువైంది . ఎన్నో పోషకాలున్నదీ . దీనితో సూప్ లు ఇతర పదార్దాలు చేసుకోవచ్చు . చారు సాంబారు తో రుచి ఇష్టమైతే పోసేయచ్చు . ఈ తొక్కల్లో ఉండే పోషకాలు మిస్ కాకండి అంటున్నారు .

Leave a comment