చర్మం తీరు ఏమైనా టోమాటో లేపనాలు వృద్యాప లక్షణాలను మాయం చేస్తాయని చర్మాన్ని మృదువుగా మార్చేయగలవని చెబుతున్నారు ఎక్సపర్ట్స్. అరటి పండు సగం ముక్క కు అర చెంచా ఆలివ్ నూనె చెంచా టమాటో రసం కలిపి మెత్తగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి ఆరనిచ్చి శుభ్రం చేస్తే చాలు పొడి చర్మం మృదువుగా మారి పోతుంది అంటున్నారు. అరకప్పు ఓట్ మీల్ కు పావు కప్పు కీరా ముక్కలు తగినంత టమాటో రసం కలిపి మెత్తగా గుజ్జులా చేసి ముఖానికి లేపనం లాగా రాయాలి. ఆరిపోయాక కడిగేయాలి చర్మంలోని జిడ్డును తొలగించి తేమ గా మారుస్తుంది. వారానికి రెండు సార్లు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది.

Leave a comment