వ్యాయామం వత్తిడిని తగ్గిస్తుందని ఆరోగ్యాన్ని పెంచుతుంది అన్నమాట నిజమే కానీ ఆ వ్యాయామాన్ని శక్తికి మించి చేస్తే అనారోగ్యాలు తప్పవు అంటున్నారు ఎక్సపర్ట్స్. అతిగా చేసే కసరత్తుల వల్ల కార్టిసాల్ హార్మోన్ ఎక్కువగా విడుదల అవుతుంది ఫలితంగా మనసు తో పాటు శరీరం కూడా అలసిపోతుంది. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది ఫలితంగా ఆకలి పెరిగి అధిక బరువుకు కారణం అవుతుంది. నెలసరి క్రమం తప్పచ్చు ముఖ్యంగా ఈస్ట్రోజెన్ స్థాయి పడిపోయి ఆస్ట్రియా పొరాసిస్ కు దారితీసే అవకాశం ఉందంటారు వైద్యులు.

Leave a comment