Gucci, ప్రపంచంలో అత్యంత ఆర్ధికంగా అమ్ముడుపోయిన లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ ఇది. ప్రపంచంలో వున్న అత్యంత ఫ్యాషన్ లుక్ ట్రెండ్స్ లో ఇది మొదటి స్థానంలో వుంటుంది. వందేళ్ళ క్రితం గుచి అనే ఇటాలి వ్యాపారి వెదురు తో చేసిన హ్యాండ్ బ్యాగ్ ల తో మార్కెట్ లోకి వచ్చాడు. తర్వాత లెదర్ తో చేసిన బ్యాగులు. అటు తర్వాత ఫ్యాషన్ ఉత్పత్తులన్నీ అందుబాటులోకి తెచ్చారు. మనకు తెలిసిన రంగులు ఏడు వుంటే ఫ్యాషన్ ప్రపంచంలో వేల రంగుల కాంబినేషన్స్ వున్నాయి. గుచి బ్రాండ్ లో అలెస్సెండ్రో, మిచేలే డిజైన్స్ చాలా పాప్యూలర్. బాలీవుడ్ వెండి తెర దేవతలు ఐశ్వర్యారాయ్, కంగనా రనౌత్, సోనం కపూర్ లంతా గుచీ డ్రెస్సులతో రెడ్ కార్పెట్ పైన నడిచిన వారే. ఇవి చాలా ఖరీదే కానీ ఒక్క అందాన్ని సృస్టించడం లో గుచి కి మిగతావేవి సాటి రావు. గుచి డాట్ కామ్ చుస్తే స్త్రీ, పురుషులు, పిల్లలు విడివిడిగా డిజైనర్ దుస్తులు కనిపిస్తాయి.

Leave a comment