ఇది వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు తక్కువే. ఇప్పుడు మహిళల చుట్టు కథ తిరిగే చిత్రాలు పెరిగాయి. ఇది ఎంతో మంచి పరిణామం. స్టార్ హీరోలు లేకపోయినా లేడీ ఓరియేంటేడ్ సినిమాలు కోట్లు రాబడుతున్నాయి ,ఈ వసూళ్ళు ఇంకా పెరగాలి. అప్పుడే హీరోయిన్ ల పైన ఉన్న చిన్న చూపుపోతుంది అంటోంది విద్యా బాలన్. ఇది వరకు స్టార్ హీరోలదే హవా. వెండి తెరపైన వాళ్ళ డామినేషన్ కనబడేది. ఇప్పుడిది తగ్గిపోయింది. ఇప్పుడు నేను చేస్తున్న శకుంతలా దేవి బయోపిక్ పైన అభిమానులకు ఎంతో అంచనాలున్నాయి. ఆమెలాగే నేను దక్షణాది మహిళ గా హెయిర్ స్టయిల్ దగ్గర నుంచి అన్ని మార్చుకున్నాను. ఆమెలాగా మారేందుకు ప్రయత్నించాను మరి ఆమెలాగా నటించి మెప్పించాన అన్నది ప్రేక్షకులే నిర్ణయించాలి అంటోంది విద్యా బాలన్.

Leave a comment