Categories
అక్టోబర్ ప్రారంభం నుంచి నవంబర్ చివరి దాకా దక్షిణాఫ్రికా లోని జోహాన్నెస్ బర్గ్ ప్రిటోరియా నగరాలు రెండు ఉదా రంగు పూల పందిళ్ళు వేసినట్లు కళకళలాడతాయి ఈ రెండు నగరాలు ఏర్పడేప్పుడు 1888 లో దాదాపు ప్రతి వీధిలో జాకరాండా మొక్కలు నాటారు అవి పెరిగి పెద్ద వృక్షాలయ్యాయి. ఇప్పుడా చెట్లే రెండు నెలలపాటు ఊదా రంగు పూలతో నిండి పోతాయి చెట్లే పూలదండలు గా నగరాన్ని అలంకరించినట్లు కనబడే అందాన్ని చూసేందుకు పర్యాటకులు ఎక్కడెక్కడినుంచో వస్తుంటారు ప్రపంచంలోనే నగరాల్లో మనుషులు పెంచిన అడవిగా జోహెన్ బర్గ్ ప్రసిద్ధి చెందింది.