తరచూ టూర్లకు ప్లాన్ చేసుకోమంటున్నారు పరిశోధకులు .పచ్చని చెట్లు ,లోయలు ,జలపాతాలు ఉండే ప్రాంతాలకు తరళి వెళ్లడం వల్ల ఒత్తిళ్ళు దూరమై మేలు చేసే ఎండుర్షిన్ లు విడుదల అవుతాయట. సంవత్సరం పాటు కొన్ని వందల మందిపై జరిపిన ఒక పరిశోధనలో ,జీవ క్రియ లక్షణాలు ,దానికి సంబంధించిన సిండ్రోమ్ పై అధ్యయనం చేసి కనీసం మూడు నెలలకొకసారి అయిన విహార యాత్రకు వెళితే జీవ క్రియలన్ని బావున్నట్లుగా గుర్తించారు . జీవ క్రియలు అన్ని బావుంటే ఎలాంటి సిండ్రోములు రావని ,గుండె సమస్యలు లేకుండా ఉంటారని పరిశోధకులు చెపుతున్నారు . కొత్త వాతావరణం లో ఒత్తిళ్ళు ను ,సమస్యలను పక్కన పెట్టేయడం వల్ల మేలు చేసే హార్మోనులు విడుదల అవుతాయి . దానితో మెటబాలిజం రేటు పెరిగి గుండెకు మేలు జరుగుతుంది .

Leave a comment