ఫోర్బ్స్‌ ‘50 వోవర్‌ 50,ఆసియా 2022’లో తమ శక్తియుక్తులతో భవిష్యత్ ను ప్రభావితం చేసిన మహిళల్లో మల్లికా శ్రీనివాసన్ కూడా ఉన్నారు. ఆమె ‘మోస్ట్‌ పవర్‌ఫుల్‌ సీయివో’ గా ట్రాక్టర్ క్వీన్ గా కూడా గుర్తించారు. ట్రాక్టర్‌ ఇండస్ట్రీని మేల్‌ డామినేటెడ్‌ ఇండస్ట్రీగా చెబుతారు. లాంటి ఇండస్ట్రీలో విజయ ధ్వజాన్ని ఎగరవేశారు మల్లికా. ట్రాక్టర్స్ అండ్ ఫామ్ ఎక్విప్ మెంట్ లిమిటెడ్  (టఫే,చెన్నై) లో జనరల్ మేనేజర్ గా ఆమె కెరీర్ మొదలు పెట్టారు. అక్కడినుంచి చైర్ పర్సన్ వరకు ఆమె ప్రస్థానంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు కూడా ఉన్నాయి. కంపెనీ ని ప్రపంచంలో మూడో స్థానంలో దేశంలో రెండో స్థానంలో నిలిచారు. నాకు మంచి ట్రాక్టర్ కావాలి అనుకునే ప్రతి రైతు మొదట మా ట్రాక్టర్ వైపే చూడాలి అంటారు మల్లికా శ్రీనివాసన్.

Leave a comment