ట్రాఫిక్ సిగ్నల్  లైట్లలో ఉపయోగించే చిహ్నాల్లో పురుషుల బొమ్మలే ఉంటాయి.నడవమని ఆగమని సూచించే బొమ్మలు పురుషులవే అయితే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ( బి.ఎం.సి ) నగరంలోని దాదర్ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల స్థానంలో మహిళా బొమ్మలను వినియోగంలోకి తెచ్చారు ఆ ప్రాంతంలోని 120 కూడళ్ళ లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్ల తో పాటు పాదచారులు సూచి బోర్డ్ పైన కూడా ఈ మార్పులు చేసింది దేశంలో మహిళల చిహ్నాన్ని ట్రాఫిక్ లైట్ల లో ఉపయోగించడం ఇదే ప్రథమం.ఎరుపు ఆకుపచ్చ రంగుల లైట్ల లోఈ చిహ్నాలు కనిపిస్తున్నాయి.ఆ రాష్ట్ర పర్యాటక మంత్రి ఆదిత్య థాకరే వీటిని గురించి ట్వీట్ చేశారు.

Leave a comment