సుశాంత్ సింగ్ ఆత్మహత్య నేపథ్యంలో దీపికా పదుకొనే  దోబారా పూఛో అన్న హ్యాష్ టాగ్ తో ఒక వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో నాలుగు కథలు కనిపిస్తాయి. మానసిక వత్తిడి తో బాధ పడే నాలుగు జంటలు ఎలా తల్లి,తండ్రి భార్య స్నేహితులు ఓదార్పుతో ఎలా ఉపశమనం పొందారో ఈ వీడియో చూపిస్తోంది. నువు వంటరివి కావు అన్న భావన కలిగిస్తే మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది అంటోంది దీపికా. ఈ ఏడాది దీపికా కు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి ప్రతిష్టాత్మక క్రిష్టల్ అవార్డ్ లభించింది. కుంగుబాటు తో బాధపడే వారిని,దీపికా 2015 లో ఏర్పాటు చేసిన ది లవ్,లాఫ్,ఫౌండేషన్ (TLLLF) ద్వారా మానసిక ఆరోగ్యం పై శిక్షణ శిబిరాలు,అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

Leave a comment