కాలేజీ అమ్మాయిలు ట్రెండీగా కనిపించాలంటే పొడవాటి మాక్సీలు, స్ట్రైట్ కట్ కుర్తాలు ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. శరీరానికి అతుక్కుని ఉండే బిగుతుగా ఉండే డ్రెస్ లు వేసుకోవద్దంటున్నారు.ఒక అంగుళం వదులుగా అయినా ఉండాలి. పొడవాటి చేతులకంటే పోట్టి చేతులు స్లీవ్ లెస్ లో కూడా చక్కగా ఉంటాయి. ప్లెయిన్ రంగులైతే సన్నగా పొడవుగా ఉన్నట్లు కనిపిస్తాయి కూడా.సిగరెట్ జీన్స్, ఫ్లెర్డ్ జీన్స్ వేసుకోవచ్చు. మినీ స్కర్టులు,క్యాప్రీలు వేసుకుని జతగా పాయింటేడ్ హీల్స్ హై ప్లాట్ ఫామ్ చెప్పులు వేసుకుంటే ట్రెండీ లుక్ వస్తుంది.

Leave a comment