గిరిజనులు పిల్లల కోసం అట్టప్పాడి రెండేళ్ల కిందట ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ పాఠశాల ప్రారంభించింది ఉమా ప్రేమాన్. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ భాషలు నేర్పటం తో పాటు మార్షల్ ఆర్ట్స్, సంగీతం, నృత్యం కూడా బోధిస్తారు.ఇరవై  సంవత్సరాలుగా పేదలకు ఎన్నో విధాలుగా ఆధారంగా ఉన్నఉమా ప్రేమాన్ కేరళలో అట్టప్పాడి దత్తత తీసుకున్నారు.  గిరిజనుల  సంక్షేమం కోసం మహిళలకు రుణాలు ఇప్పించి టైలరింగ్, విస్తరాకులు కుట్టటం, శానిటరీ నాప్ కిన్స్  రూపొందించటం నేర్పించారు వీ గార్డ్ సంస్థ సహకారంతో వడ్డీ లేని రుణాలు ఇప్పించి స్వయం ఉపాధి కల్పించారు ఉచిత డయాలసిస్ కేంద్రం  స్థాపించారు.  కేరళ, తమిళనాడులో మొబైల్ డయాలసిస్ కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు ఉమా ఈ సందర్భంలోనే కిడ్నీలు పాడైన ఒక నిరుపేద యువకుడికి తన కిడ్నీ దానం చేశారు ఉమా ప్రేమన్ .

Leave a comment