శిరోజాలను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తుంటే బాగా పెరుగుతాయనుకోవటం కేవలం అపోహా. జుట్టు కుదుళ్ళ దగ్గర నుంచి పెరుగుతోంది కానీ కొసన నుంచి కాదు. కాబట్టి జుట్టు కట్ చేసిన, చేయక పోయినా వెంట్రుకల ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం ఉండదు. కాకపోతే చిట్లిపోయినా కొసల్ని కట్ చేయటం వల్ల నీట్ గా కనిపిస్తుంది. తాజా రూపం కోసం ఎక్కువ వ్యాల్యూమ్ కోసం జట్టు కట్ చేసుకోవాలి అంటారు ఎక్సు పర్ట్స్. ఇక పోతే షాంపలనూ పూర్తిగా శిరోజాలకు పట్టించాలి అనుకొంటారు కానీ షాంపూ ప్రయోజనం క్లెన్సింగ్ .దాన్ని మాడుపైన అప్లైయ్ చేసి దాన్నే స్ర్పెడ్ చేస్తూ తలంతా రుద్దేయా వచ్చు. కండిషనర్ ను మాత్రం కొసలదాకా రాయాలి. అప్పుడే జుట్టు మెత్తగా ఉండి కొసలు చిట్లిపోకుండా ఉంటాయి.

Leave a comment