త్రిదళం త్రిగుణాకారం అంటాము కదా!!

ఈ రోజు శివునికి అత్యంత ప్రీతికరమైన మారేడుదళం గురించి చెప్పుకుందాం.మారేడు చెట్టు, ఆకులు,కాయలు ఎంతో పవిత్రమైనవి. ఈ చెట్టుకి పువ్వు వుండదు.మూడు ఆకులతో కలిసిన దానినే త్రిదళం అంటారు. వీటితో శివలింగంను పూజిస్తే జన్మ జన్మల పాపం హరిస్తుంది. మారేడు కాయలోని గుజ్జును ఉపయోగించి విభూతిని తయారు చేస్తారు.
మారేడు దళాలతో పూజించిన త్రియాయుష్షు అని అంటే బాల్యం,కౌమార్యం,యవ్వనం చూస్తావు అని మనసారా దీవిస్తాడు శివయ్య. మారేడు చెట్టు కింద కూర్చుని భోజనం చేసిన ఆరోగ్యానికి మంచిది.మారేడు దళంను శివలింగం పైన తిరగేసి పెట్టి పూజించాలి.

నిత్య ప్రసాదం:కొబ్బరి,పండ్లు,పంచామృతాలతో అభిషేకం.

-తోలేటి వెంకట శిరీష

Leave a comment