సెలబ్రిటీలు ట్రోలింగ్ లకు గురవుతూ ఉంటారు . సోషల్ మీడియాలోనో ,ఇన్ స్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేయగానే శారీరక ఆకృతి గురించో ,డ్రస్ ల పైనో ట్రోలింగ్ మొదలవుతుంది . అభిమానులకు టచ్ లో ఉండేందుకు పోస్టులు తప్పవు . వెంటనే ఈ వ్యాఖ్యానాలు తప్పవు . ఈ విషయం గురించి నిత్య మీనన్ ఈ పద్ధతి సమంజసం కాదని చెపుతుంది ప్రజలు విభిన్నంగా ఉండే వారిని గుర్తించటం అలవాటు చేసుకోవాలి . అందరూ ఒకేలా ఉండరు . తారలు ఇలా ఉండాలి ఆలా ఉండాలి అని ఆశిస్తారు . లేకపోతే విమర్శలొస్తాయి . సినిమా మీడియా లో ఎంతోమంది తో కలసి పని చేయాలి. కొత్త కొత్త డిజైన్స్ ,ఆభరణాలు మార్కెట్ లోకి లాంచ్ చేయాలంటే తారలే ఆధారం . ఆ డిజైన్స్ నప్పకపోవచ్చు లేదా అటువంటి డ్రస్ లో మమ్మల్ని చూసేందుకు ప్రేక్షకులు ఇష్టపడక పోవచ్చు . ఇలా ఆశించటం,ట్రోలింగ్ లు మానేస్తే బావుండు అంటోంది నిత్యామీనన్ .

Leave a comment