చిన్నపాటి అనారోగ్యాలకు ఇంట్లో ఉండే వస్తువులే మందుల కంటే అద్భుతంగా పని చేస్తాయి.వేపాకులను మజ్జిగ లో నూరి కాలిన గాయాలపై రాస్తే స్వాంతన లభిస్తుంది కప్పు మరిగే నీళ్లలో గుప్పెడు తులసి ఆకులు చెంచా మిరియాలపొడి వేసి మరిగించి పంచదార వేసి తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి. ఎండలో తిరిగి వికారంగా అనిపిస్తే చిన్న అల్లం ముక్క నూరి రసం తీసి అందులో నిమ్మరసం తేనె కలిపి తాగితే సరి. కొబ్బరి నూనె నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని పేస్ట్ లా చేసి మోకాళ్ళకు రాసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గిపోతాయి. మధుమేహంతో బాధపడే వాళ్లు రోజూ వెల్లుల్లి తింటే మంచిది.

Leave a comment