పదిమంది మధ్యలో ఉన్నప్పుడు ఏదైనా శుభకార్యం జరుగుతుంటేనో, సామాజిక కార్యక్రమాల్లోనో, సెంటిమెంట్ తో ఎవరైనా ఎమన్నా అనుకొంటారానో తుమ్ము వస్తుంటే బలవంతంగా ఆపెస్తారేమో కానీ అలా తుమ్ము వచ్చినప్పుడు ఆపుకోవడం చాలా ప్రమాదం. తుమ్మొచ్చినప్పుడు వెలుపలికి వచ్చేగాలి గంటకు వంద మైళ్ళ వేగంతో వస్తుందిట. దాన్ని బలవంతంగా ఆపేస్తే ముక్కులో కార్డిలేడ్ ఫ్రాక్చర్లు కావడం, ముక్కులోంచి రక్తం కారడం, కర్ణభేరి చిట్లడం, వినికిడి లోపం, తాత్కాలికంగా మొహం వాడిపోవడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి. ఇలాంటివి జరక్కుండా ఉండాలంటే ఎలాంటి సందేహం లేకుండా తుమ్మొస్తే తుమ్మేయాలి. అదే క్షేమం.

Leave a comment