ఏదైనా ప్రయాణానికి ముందో, ఎక్కడి కైనా వెళుతుంటేనో మంచి పనేదైనా మొదలు పెట్టేటప్పుడు బావుండదని సాధారణంగా వచ్చే తుమ్ము బలవంతంగా ఆపేస్తూవుంటారు. కానీ ఇలా తుమ్మును ఆపుకోవడం చాలా హానికరం అంటున్నారు. వైద్యులు తుమ్మినప్పుడు వచ్చే గాలి గంటకు వందమైళ్ళు ప్రయాణించే వేగంతో వుంటుంది. దాన్ని బలవంతంగా ఆపేయడం వల్ల నాజల్ కార్టిలేజ్ ఫ్యాక్టర్లకు ముక్కు నుంచి రక్తం కారటానికి చెవిలో కర్ణభేరి చిరిగి పోయేందుకు అవకాశాలు ఉన్నాయి. లేదా ముఖం వాచిపోతుంది. అందుకే తుమ్ము గనుక వస్తే దాన్ని బలవంతంగా ఆపేయకుండా ఏ టిష్యు నో ముక్కుకు అడ్డం పెట్టుకుని ఇతరులకు ఇబ్బంది కలుగనీయకుండా సైలెంట్ గా తుమ్మేయడం మంచిది. అంతే గానీ తుమ్ముకు బ్రేక్ వేయొద్దు.

Leave a comment