పిక్సర్ సంస్థ నిర్మించిన ‘టర్నింగ్ రెడ్’ యానిమేషన్ చిత్రం రికార్డులను బద్దలు చేస్తోంది. నెలసరులు టీనేజీ వయసుల్లో ఆడపిల్లల భావోద్వేగాలే ముడిసరుకుగా దర్శకురాలు డోమీ షి నిర్మించిన ఈ చిత్రంలో మెమో అన్న అమ్మాయి అమ్మ ఇద్దరే ముఖ్య నటులు మెమో కి నెలసరి వస్తే చాలు ఉన్నట్టుండి ఒక భావోద్వేగానికి గురై రెడ్ పాండా గా మారుతోంది. అలా ఎందుకు మారుతుంది అన్నదే కదా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, రచన జూలియా చొ నిర్మాణ బాధ్యతలు లిండ్సే కాలిన్స్. అంతా మహిళలే పని చేసిన సినిమాగా కూడా టర్నింగ్ రెడ్ ప్రశంసలు అందుకుంది. 99 నిమిషాలున్నా ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్ లో ఉంది.

Leave a comment