Categories
Gagana

టుస్సాడ్స్ మ్యుజియంలో మధుబాల.

పాత సినిమాలు చూసే అలవాటుంటే మధుబాల తెలేసేవుంటుంది. బాలివుడ్ క్లాసిక్ క్వీన్ మరణించిన ఎన్నో ఏళ్ళ తర్వత ఒక అపూర్వమైన గౌరవం దక్కింది. మధుబాల మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యుజియంలో పెట్టనున్నారు. మొఘల్ ఎ ఆజాయ్ సినిమాలో మధుబాల అద్భుతమైన నటన ను ప్రదర్శించి అంతకంటే అందమైన మొహం ఇంకెవరికీ లేదనిపించుకున్నారు. ఇప్పుడీ సినిమాలోని అనార్కలీ పాత్రనే మైనపు విగ్రహంగా పెట్టబోతున్నారు. ఈ విషయం గురించి టుస్సాడ్స్ ప్రతినిది మాట్లాడుతూ, అలనాటి నటి మధుబాల మైనపు విగ్రహాల్ని మ్యుజియంలో పెట్టడం చాలా సంతోషం. కోట్లాది అభిమానులను అసంపాదించు కున్న నటి మధుబాల. ఆమె మైనపు బొమ్మతో సేల్ఫీ దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారన్నారు.

Leave a comment