భారత నౌకాదళంలో ఎయిర్ బోర్న్ టాక్టీషియన్స్ పర్యవేక్షకులుగా పనిచేసే అవకాశం ఇద్దరు అమ్మాయిల కు దక్కింది సబ్ లెఫ్టినెంట్ కుముదిని త్యాగి,సబ్ లెఫ్టినెంట్ రీలిసింగ్ ఈ ఆవకాశాన్ని చేజిక్కించుకొని భారతీయ నౌకాదళం చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర తీశారు కోచ్చి లోని దక్షిణ నావికాదళ కమాండ్ నిఘా విభాగం నుంచి తాజాగా ఉత్తీర్ణులయ్యారు. కఠినమైన శిక్షణ తో అమ్మాయిలు యుద్ధ నౌకల్లో పని చేయగలరని నిరూపించారు. ఈ ఇద్దరు శత్రువుల కు చెందిన జలాంతర్గాములను మిసైల్స్ ని ప్రయోగించే యుద్ధ నౌకలను పసిగట్టి వారిపై దాడికి అవసరమైన వ్యూహాన్ని పైలెట్ కు అందిస్తారు ఇద్దరూ కంప్యూటర్ మైన్స్ లో ఇంజనీరింగ్ చేసి 2018లో నేవి లో చేరిన వాళ్ళు.

Leave a comment