వ్యక్తిత్వ వికాసంలో యూ టర్న్ అనేది చాలా ముఖ్యమైన పాఠం అంటారు. చాలా మంది తమ నిర్ణయాలు తమ జీవిత విధానం చాలా పర్ ఫెక్ట్ అనుకుంటారు. అదే ఇతరులకు నూరిపోయాలని చూస్తారు. ముఖ్యంగా ఇళ్ళలో పెద్దవాళ్ళు . అందుకే వాళ్ళలో తప్పు కనబడగానే దాన్ని పెద్దది చేసి చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఘర్షణ పెరుగుతుంది. అంటే భాధించాలనుకునే వాడు మాష్టర్ లాగా ఉండకూడదట. మోడల్ గా ఉండాలి.ఇతరులు మారాలి అని నిరంతరం అసంతృప్తితో జ్వలించిపోయే కంటే మనిషి ఎలా ఉంటే ఇతరులు వాళ్ళని అనుసరిస్తారు అలా స్పూర్తిగా మారాలట. నిన్ను మార్చేస్తా అనే సబ్జెక్ట్ నుంచి నేను మారి చూపిస్తా ననే యూ టర్న్ తీసుకోవాలి.
సరైన తరుణంలో సరైన మలుపు తీసుకోవాలి.

Leave a comment