నెల్లూరు జిల్లా ఉదయగిరి రాజుల కాలం నుంచే చేతి కళలకు పెట్టింది పేరు. నవాబ్ కులీ కుతుబ్ షా కాలం నుంచే ఈ హస్త కళా నైపుణ్యం గురించి చరిత్రకారులు రాశారు. ఇప్పుడా చరిత్ర పునరావృతమైంది ఈ ప్రాంతానికి చెందిన గౌసియా బేగం,తన తండ్రి బషీర్ సాయంతో చెక్క నగిషీలు తయారు చేయటం నేర్చుకొంది ఆమెతో పాటు మరో 15 మంది మహిళలు ఈ కళలో ప్రావీణ్యం సంపాదించారు. వీరు తయారు చేసిన చెంచాలు,ఫోర్కులు,కత్తులు, కంచాలు, పండ్ల ట్రేలు,టేబుల్ మ్యాట్ లు జడ క్లిపులు చిన్న పిల్లలు ఆడుకొనే బొమ్మలు మొత్తం 200 రకాల ఉత్పత్తులు ఆన్ లైన్ లో అమ్ముతున్నారు. ఇక్కడి మహిళల ఆదరణ కరువైపోయిన ఈ కళకు ప్రాణం పోస్తు తమకు ఒక జీవనోపాధి సమకూర్చు కొంటున్నారు. ఈ చెక్కతో చేసిన నగిషీలు ఎంతో అందమైన డిజైన్స్ లో చాలా అందంగా ఉన్నాయి.

Leave a comment