రేపే ఉగాది . కొత్త సంవత్సర ఆరంభానికి  సూచనగా ఉగాది జరుపుకుంటాం.  చైత్ర మాసంలో ప్రకృతిలోని చెట్లు కొత్త చిగుర్లు తొడిగి చైతన్యవంతమవుతాయి.  ప్రకృతిలో సంభవించే కొత్త మార్పుకు నాంది ఉగాది. అందుకు కూడా ఈ మాసం ఆరంభానికి ఉగాది అని పేరోచ్చి ఉంటుంది.  కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ  ఈ పర్వదినాన అభ్యంగనము, ఉగాది పచ్చడి తినటము ,పంచాగ శ్రావణం చాలా ముఖ్యం.  ప్రతి మనిషి జీవితంలోని అనుభవాలకు ప్రతీకగా  ఈ పచ్చడిని తీపి,పులుపు,వగరు, చేదు కలిసేట్టుగా వేపపువ్వు ,బెల్లం, మామిడి ,చెరకు ముక్కలు ,కారం ,చింతపండు ఇవన్నీ కలిపి తయారు చేస్తారు. ఈ ఉగాది పర్వదినాన అందరి మనోభీష్టాలు నెరవేరి సుఖసంతోషాలతో  ఆనందంగా జీవించాని  కోరుకొంటున్నాం. సర్వజనులు సుఖంగా జీవించాలి. అందరికీ శుభాలే కలగాలి.

Leave a comment