కోత్త సంవత్సరం కొత్త నిర్ణయాలు ఏమైన తీసుకున్నారా అంటుంది అనుపమా పరమేశ్వరన్. ఇలాంటివి నేను నమ్మనే నమ్మను అంటుంది అనుపమ.ఇది మంచి నిర్ణయం అని ఎప్పుడు అనిపిస్తే అప్పుడే శ్రీకారం చుడతా అంటుంది. నేను కన్న కలల కంటే అందమైన విషయాలు నా జీవితంలో చాలా జరిగాయి.పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలినాళ్ళలో పెద్దగా ప్రయత్నం చేయకుండానే తొలినాళ్ళలో మంచి మంచి అవకాశాలు చేతికందాయి.వాటిని అంతే జాగ్రత్తగా సద్వీనియోగం చేసుకున్నా.సినిమాలు చూసేటప్పుడు చిన్నప్పుడు తారల క్రేజ్ గురించి చదువుతున్నప్పుడు ఎంతో ఆసక్తిగా ఉండేది. నేను కలలలు కని నిరాశపడి ప్రయత్నాలు చేసింది ఏది లేదు. అవకాశాలు అలా వచ్చాయి. నేను శ్రద్దగా గౌరవంతో పని చేసుకున్న అంతే తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అంటుంది అనుపమ పరమేశ్వరన్.