ఉల్లిపాయ వాసన కాసేపు అవతల పెడితే అవి సహజ క్లెన్సర్లు గా పని చేస్తాయి . దీన్నీ క్లెన్సర్ గా టోనర్లుగా ఎక్కేవగా వాడుకోవచ్చు. వీటిలోని యాంటీ-ఆక్సీడెంట్స్ చర్మం లోని మలినాలను బయటికి తెస్తాయి. అందువల్ల చర్మం మృదువుగా అందంగా కనిపిస్తుంది. ఒక టీ స్ఫూన్ ఉల్లి రసంలో శనగపిండి ,పాలమీగడ కలిసి ఫేస్ వాస్ చేసి ఓ అరగంట తర్వాత కడిగెస్తే చర్మం కాంతి పెరుగుతుంది. ఉల్లి పాయలలో ఉండే సహజమైన బ్లీచ్ చేసే గుణం చర్మంపై మృత కణాలను తొలగిస్తుంది. ఉల్లిపాయలోని క్వెర్సిటెన్, ప్రీరాడికల్స్ చేసే హానీనుంచి రక్షిస్తూ వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తోంది. ఉల్లి రసం చర్మంపై నల్లని మచ్చలను తొలగించి స్కిన్ టోన్ పెంచుతుంది.

Leave a comment