ఆకుకూరలు రెండు మూడు రకాలు తెస్తే ఒకేసారి వండ లేకపోతే పాడైపోతూ ఉంటాయి .అలాంటప్పుడు తెచ్చిన ఆకుకూరల్లో పాలకూర ఉంటే దాన్ని అయిదారు రోజులు తాజాగా ఉండే పేస్ట్ లాగా చేసుకోవచ్చు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి మరుగుతున్న నీళ్లలో పాలకూర ఆకులు వేసి ఉడకనివ్వాలి వడకట్టి ఆకుల్ని చల్లారనివ్వాలి మిక్సీ జార్జ్ లో ఈ ఉడికిన ఆకులు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ లాగా చేసి కంటైనర్ లో వేసి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. తాజాగా ఉండే ఈ పేస్ట్ ని పాలక్ రోటి, పరాఠా, పూరి, పాలక్ ఆలూ కుర్మా, పాలక్ పన్నీర్ లు చేయవచ్చు.

Leave a comment