తొలి మహిళా సీఐఏ డైరెక్టర్ గా గీనా హాస్పెల్ ఎంపికై చరిత్ర సృష్టించింది. 1947 సెప్టెంబర్ లో స్థాపించిన ఈ స్పై ఏజెన్సీల్లో ముందుగా పురుషాధిపత్యం కొనసాగినా తర్వాతి కాలంలో మహిళలే అనివార్యంగా సేవలందించారు. 1985లో స్పై ఏజెంట్ గా చేరిన గీనా హాస్పెల్ 33 ఏళ్ళ పాటు అండర్ కవర్ ఏజెంట్ గా పని చేసింది. ఎన్నో కీలక పరిస్థితుల్లో తన సేవలు అందించింది. అడుగడుగునా సవాళ్ళు ఎదురయ్యే ప్రాణ భయంతో కూడిన ఈ వృత్తిలో ఆమె చక్కని ప్రతిభ కనబరిచింది. స్త్రీలు ఎప్పుడు ఏచిన్న అవకాశం దొరికినా వారి ప్రతిభ నిరూపించుకుంటున్నారని చెప్పేందుకు ఈ సీఐఏ డైరెక్టర్ జీవితం గొప్ప ఉదాహరణ.

Leave a comment