అస్సలు ఊహించలేదు

యాక్టింగ్ అంటే నాకు ఇష్టమే కానీ ఇప్పుడు సైకాలజీ చదువుకుంటున్నాను కదా ఇప్పుడే ఎందుకీ సినిమాలు అనుకున్నాను కానీ కథ విన్నాక ఈ సినిమా చేయాలనుకున్నాను .ఇంతకు ముందు కొన్ని యాడ్స్ చేసిన అనుభవం మాత్రం ఉంది .నాకు వచ్చిన దాన్ని సహజంగా చేశాను తీరా చూస్తే నా కోసం సోషల్ మీడియా లో ఫ్యాన్స్ క్లబ్ లు కూడా ఉన్నాయని నాకు ఫాన్స్ ఉన్నారని తెలిసి ఎంతో ఆశ్చర్యంగా ఉందొ అంటుంది కృతి శెట్టి. వైష్ణవ్ తేజ్ కృతి శెట్టి జంటగా ఉప్పెన విడుదలయ్యాక ఆమెకు ఎన్నో అవకాశాలు తలుపు తట్టాయి ఉప్పెన విడుదలయ్యాక ఎలా ఉందో చూసుకొనే కొత్త సినిమాలు ఒప్పు కొందాం అనుకుంటున్నాను కానీ కథలు వచ్చాయి శ్యామ్ సింగరాయ్ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాల్లో నటించేందుకు వప్పుకొన్నాను అంటోంది కృతి శెట్టి.