అమ్మాయిలు ఇష్టంగా ధరించే చెవి లోలాకులు బుట్టల దే హవా. నవ్వినా,మాట్లాడిన, తల ఊపిన అందంగా ఊగాడే బుట్ట లోలాకులు అమ్మాయిలకు కొత్త అందం ఇచ్చేస్తాయి. ఏనాడో అమ్మలు, అమ్మమ్మల కాలం నాటి బుట్టల లోలాకులు ఇప్పటికీ కాలం చెల్లలేదు అంటే అసలా తయారీ లోనే ఒక ప్రత్యేకత .బోర్లించినట్లు గుండ్రని బుట్టలు దీనిచుట్టూ ముత్యాలు లేదా చిన్న బంగారు గుండ్లు బుట్ల చేసిన డిజైన్ అయితే ఇప్పుడు టెంపుల్ నక్షీ, స్టోన్, సాచీ,పోల్కి, ఫిలిగ్రీ, తవ,తుషీ ఇలా అన్ని రకాల డిజైన్ లలోను బుట్ట లోలాకు అందంగా ఊగుతోంది. అలాగే పంజరం, జేగంట, త్రికోణం, కోణాకారం,చతురస్త్రం, ఇలా రకరకాల రూపాల్లో బుట్ట లోలాకు మెరిసిపోతోంది .ఒకటీ,రెండు,మూడు, నాలుగు బుట్టల తో తయారైన మల్టీ బుట్టల లోలాకులు మరింత ఫ్యాషన్. బుట్టల తో పాటు చంప సరాలు ఇంకా అందం జువెలరీ డిజైన్ లలో టెంపుల్ డిజైన్ బుట్టలు ఇంకా బావుంటాయి .ముత్యాలు బంగారపు పూసలతో జారువారే షాండ్లియర్ బుట్టలది ఇంకో అందం. ముత్యాలు, కెంపుల, పచ్చలతో పొదిగి చేసే బుట్టల డిజైన్స్ పండగ ప్రత్యేకం ! ఎవరైనా ఈ బుట్టల అందానికి ఫిదా అవ్వాల్సిందే !
Categories