
ఈ సంవత్సరం వరల్డ్ రగ్బీ ఆసియా అన్‌స్టాపబుల్ ప్రకటించిన 32 మహిళా క్రీడాకారులలో సంధ్య రాయ్ పేరుంది. ఉత్తర బెంగాల్‌లోని సిలిగురికి తూర్పు వైపున.. బైకాంత్‌పూర్ అటవీ ప్రాంతంలో ఉంటుంది సరస్వతీపూర్ గ్రామం.సంధ్య రాయ్ పుట్టిన వూరిది. జంగిల్ క్రోస్’ అనే ఔత్సాహిక రగ్బీ టీమ్ లీడర్ అటవీ ప్రాంతాల్లోని పిల్లలు ఆ ఆటకు పట్టునిస్తారనే ఆశతో ఇక్కడి పిల్లలకు శిక్షణ ఇచ్చారు. సంధ్య రాయ్ తో పాటు తొమ్మిది మంది బాలికలు శిక్షణ తీసుకున్నారు.ఈ ఏడేళ్లుగా రగ్బీ లో తన సత్తా చూపిస్తూనే వుంది సంధ్య. కాకులు దూరని కారడివి నుంచి వచ్చి గ్రామానికి పేరు తెచ్చిన అమ్మాయి పైన బెంగాలీ నిర్మాత రోహన్ చక్రవర్తి డాక్యుమెంటరీ తీశారు. వరల్డ్ రగ్బీ సంధ్య ను అన్‌స్టాపబుల్ క్రీడాకారిణిగా గుర్తించింది.