Categories
పది రూపాయల ఖరీదు తో పసుపు సంచి ఉద్యమాన్ని ప్రజల్లోకి తెచ్చారు ఐ.ఎ.ఎస్ అధికారి సుప్రియ సాకు.సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాక తమిళనాడు లో పసుపు సంచుల తయారీ ని ప్రోత్సాహించారు సుప్రియ.ఎక్కడ చూసినా పసుపు సంచి దొరికే వెండింగ్ మిషన్ లు స్థాపించారు. పది రూపాయలు వేస్తే సంచి బయటకు వస్తుంది. ‘మీడుం మంజాపై’ పేరుతో ఈ పసుపు సంచుల ప్రచారం తమిళనాడు లో సక్సెస్ అయింది. వందల మంది మహిళలకు ఉపాధి కల్పిస్తోంది.