సినిమా వాళ్ళు ఎప్పుడు సరికొత్త ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. కొత్త కొత్త సంగతులను కథలో చెప్పాలని చూస్తారు. ప్రేక్షకులు కుడా దీన్ని ఫాలో అవ్వాలి. పాత పాత్రని ఊహించుకుంటూ థియోటర్ కి వస్తే ప్రమాదం. ప్రేక్షకుల ఆలోచనకు మరి దగ్గరగానో మరి దూరంగానో సినిమా ఉండకూడదు వాళ్ళని ఆశ్చర్యపరచాలి అంటుంది అనుష్క. విషయం ఏదైన సరే పాత ఫార్ములా నాకు ఇష్టం ఉండదు. ఎప్పుడో అరుంధతి బాగా ఆడితే ఇప్పుడు భాగమతితో దాన్ని పోల్చి చూడకూడదు. అరుంధతి తర్వాతనే భాగమతి కదా ఇందులో కొత్త ధనం ప్రేక్షకులు అర్ధం చేసుకుంటే సినిమాలు చక్కగా ఆడేస్థాయి అంటుంది అనుష్క. అప్ డేట్స్ తో ఎప్పటికప్పుడు సినిమాలు చేయాలని ఆశపడుతుంది అనుష్క.

Leave a comment