సాధారణంగా స్నేహితుల ఇళ్ళకు పోతే ఇంట్లో ఉండే పిల్లలకు ఏదైనా గిఫ్ట్ తీసుకుపోతూ ఉంటాము. ఆ గిఫ్ట్ పిల్లలకు ఉపయోగపడేదిలా ఉంటే బావుంటుంది.అలాగే పెద్దవాళ్ళకు ,గృహిణిలకు తీసుకుపోయే వస్తువులు వాళ్ళకి ఉపయోగపడాలి. ఇంట్లో గృహిణికి క్షణం తీరిక ఉండదు,ఆమె ఆరోగ్యం ఆమెకు పట్టదు కదా. అలాంటప్పుడు ఎక్సర్ సైజ్ సైకిల్ ,స్కిప్పింగ్ రోప్ ,డంబెల్స్ వంటివి ఆమెకు కానుకగా ఇస్తే వ్యాయామం చేయాలనే స్ఫూర్తి ఆబెలో కలుగుతుంది. అలాగే పిల్లలకు ఇద్దామనుకునే గౌన్లు బొమ్మలకు బదులు ఆ డబ్బుతో పోస్టాఫీసులో ఐదేళ్ళుకు ఒక బాండ్ తీసుకోవచ్చు. అలాగే నెలంతా వాళ్ళింటికి వచ్చేలా ప్రూట్ బౌల్ హోం డెలివరీ ఏర్పాటు చేస్తే బావుంటుంది. వాళ్ళకు ఉపయోగపడే లైట్లు ,ఫ్యాన్లు కూర్చున్న చోట నుంచే ఆన్ చేసే సెన్సార్ పరికరాలు కూడా వాళ్ళని ఆనందపెడుతాయి.

Leave a comment