ఇది ఉసిరి కాయల సీజన్. చెట్లు నిండుగా ఫుష్కలంగా ఉసిరి కాయలు దొరుకుతాయి. విటమిన్-సి మెండుగా ఉండే ఈ ఉసిరిని సీజన్ అయ్యేంత వరకు ఆహారం లో భాగంగా తీసుకోవాలి. అప్పుడే కురులకు బలం వస్తుంది. ఉసిరి జ్యూస్ తప్పని సరిగా  తీసుకోవాలి ఉసిరి రసం తో మాడుకు మర్దన చేస్తే జుట్టు పాడవకుండా బావుంటుంది ఈ మర్దన తో మాడుకు రక్త ప్రసరణ జరిగి కేశాలు పెరగటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది జుట్టు ఆరోగ్యంగా తేమతో నిగనిగలాడాలంటే ఉసిరి నూనె క్రమం తప్పకుండా రాసుకోవాలి. ఇది జుట్టు రాలనివ్వదు. చిట్ల నివ్వదు ఇది ఇంట్లో తయారు చేసుకోవటం కూడా చాలా తేలిక. ఏ రసాయనాలు కలపకుండా ఇంట్లో తయారు చేసిన ఆయిల్ జుట్టుకు ఎంతో పోషణ ఇస్తుంది.

Leave a comment