ఈ చలిరోజుల్లో విరివిగా దొరికే ఉసిరి ఎక్కువగా తింటే ఎంతో మంచిది అని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు ఈ కరోనా సమయంలో ఎ, సి విటమిన్లు సమృద్ధిగా ఉండే ఉసిరికాయలు నేరుగా కానీ రసం రూపంలో కానీ తీసుకుంటే ఫ్లూ జ్వరాలు రాకుండా ఉంటాయంటున్నారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె కండరాలకు బలాన్ని ఇస్తాయి. ఈ కాయల్లో ఉండే క్రోమియం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. చర్మం మృదువుగా ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment