ఈ వేసవి వెళ్ళేవరకు చిరుధాన్యాలపైన కాస్త దృష్టి పెట్టండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. చిరుధాన్యాల్లో రాగులు ఉత్తమ స్థాయిలో ఉంటాయి. వీటిని ఏ రూపంలో తీసుకున్న మంచిదే. కాల్షియం,ఐరన్, ఇతర ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు, కండరాలు, దంతాలకు బలాన్ని ఇస్తాయి. వేసవిలో ఉదయాన్నే రాగి జావ తాగుతుంటే వడదెబ్బ భయం ఉండదు. ఎసిడిటీ గలవారికి రాగిజావ ఔషధంగా పని చేస్తుంది.గ్లూటెన్ సమస్య ఉంటే రాగులు మంచి ప్రత్యామ్నాయం ఇవి రోగనిరోధక శక్తి పెంచుతాయి. స్థూలకాయం ఉన్న వారికి సరైన ఆహారం కూడా. డయాబెటిస్, రక్తపోటు ఉంటే ఆహారంలో సగభాగంగా రాగులే ఉండటం బెస్ట్.

Leave a comment