జీవితంలో వచ్చే అపురూపమైన కొత్త మలుపు పెళ్ళి. ఆ ఒక్కరోజు అందరి కళ్ళు పెల్లికుతురి పైనే ఉంటాయి. ఖరీదైన పెల్లిమందపాలు జిగేలు మనే లైట్లు వెలుగుతో మరి పెళ్లి కూతురు మెరిసిపోవాలంతే కొద్దిపాటి జాగ్రత్త చాలు. పెళ్లి దుస్తులు బరువు లేనివిగా ఎంచుకోవాలి. నెట్, క్రేప్, షిఫాన్, తేలికపాటి సాటిన్, బోర్డర్ లేని కోటా హ్యాండ్ లూమ్. హెవీ బ్లావుజులు బావుంటాయి.పెళ్ళికి నలుగు రోజుల ముందు నుంచే సందడి మొదలైపోతుంది. పెళ్లి సమయంలో సహజంగా వత్తిడి వుంటుంది. అందుకే భోజనంలో కాంప్లెక్స్ హైడ్రేడ్స్ తీసుకోవాలి. పిచు పదార్ధాలు ఎక్కువగా వుండే డైట్ తీసుకోవాలి. మంచి నీళ్ళు తప్పని సరిగా తీసుకోవాలి. పెళ్లి సమయంలో చక్కని పువ్వుల జడ ఎంతో అందం ఇస్తుంది. భారీ మేకప్ లేకుండా వాటర్ ఫ్రూఫ్ లైనర్స్ ఫౌండేషన్లు వాడితే బావుంటుంది. అలాగే మంచి లేస్ వర్క్ తక్కువ ఎంబ్రాయిడరీ వున్న దుస్తులు బావుంటాయి. బరువు తక్కువ వున్న గాగ్రా, లేహంగాలకు చక్కని డిజైన్ వున్న చోళి వేసుకుంటే బావుంటారు. మొత్తం బరువైన ఎంబ్రాయిడరీ లో భారీ నగలతో మోయలేని భారం పెళ్లి కూతురి పై పడితే కష్టమే కదా.

Leave a comment